LSG vs RCB: జితేష్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. క్వాలిఫైయర్ 1కు చేరుకున్న బెంగళూరు.. 9 month ago

featured-image

ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లక్నో వేదికగా భారత్ రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు. మొదట టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ జితేష్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నారు. 


తొలుత బ్యాటింగుకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు (4 ఫోరులు, 5 సిక్స్‌లు), బ్రీట్జ్‌కే 12 బంతుల్లో 14 పరుగులు (1 ఫోర్, 1 సిక్స్) చేసి వెనుదిరిగారు. లక్నో సూపర్ జెయింట్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ పూరన్ 10 బంతుల్లో 13 పరుగులు (1 ఫోర్), కెప్టెన్ రిషబ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు (11 ఫోరులు, 8 సిక్స్‌లు) చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరిలో అబ్దుల్ సమద్ 1 పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ విషయానికి వస్తే తుషార, భువనేశ్వర్, రోమారియో షెఫర్డ్ చెరొక వికెట్ తీసుకున్నారు. 


తర్వాత బ్యాటింగుకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్ 19 బంతుల్లో 30 పరుగులు (6 ఫోరులు), కింగ్ విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 54 పరుగులు (10 ఫోరులు) చేసి వెనుదిరిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ రజత్ పటీదార్ 7 బంతుల్లో 14 పరుగులు (1 ఫోర్, 1 సిక్స్) చేసి ఔటయ్యాడు, లియామ్ లివింగ్‌స్టోన్ డక్ ఔట్ గా నిలిచాడు, చివరిలో మయాంక్ అగరవాల్ 23 బంతుల్లో 41 పరుగులు (5 ఫోరులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ జితేష్ శర్మ 33 బంతుల్లో 85 పరుగులు (8 ఫోరులు, 6 సిక్స్‌లు) చేసి నాటౌట్ గా నిలిచారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 18.4 ఓవర్లకి 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ విషయానికి వస్తే విలియమ్ ఓ'రూర్కే 2 వికెట్లు, ఆవేశ ఖాన్, ఆకాష్ సింగ్ చెరొక వికెట్ తీసుకున్నారు. 


దింతో ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 6 వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో స్థానం సంపాదించింది. ఈ మ్యాచ్ కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ జితేష్ శర్మ నిలిచాడు.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD